మొద‌లైన గుర్తుందా శీతాకాలం షూట్‌

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Aug 28, 2020 | 2:45 PM

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా జంటగా న‌టిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో, నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై..

మొద‌లైన గుర్తుందా శీతాకాలం షూట్‌

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా జంటగా న‌టిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో, నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న, ర‌విలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్.. నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర హీరో స‌త్య‌దేవ్, ద‌ర్శ‌కనిర్మాత నాగ‌శేఖ‌ర్, సంగీత ద‌ర్శ‌కుడు కాల‌భైర‌వ‌, సినిమాటోగ్రాఫ‌ర్ స‌త్య హెగ్ఢే, చిత్ర యూనిట్ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ..

గుర్తందా శీతాక‌లం చిత్రంలో న‌టించేందుకు నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత నాగ‌శేఖ‌ర్‌కి ప్ర‌త్యేక‌‌ కృత‌జ్ఞ‌త‌లు, ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ త‌మ‌న్నాతో క‌లిసి న‌టించడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రానికి అద్భుత‌మైన ట్యూన్స్, నేప‌థ్య సంగీతాన్ని ఇస్తార‌ని ఆశిస్తున్నా. ఎప్ప‌టిక‌ప్పుడు నన్ను ప్రొత్స‌హిస్తూ నా సినిమాల్ని హిట్ చేస్తున్న సినీ అభిమానుల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞత‌లు, వారంద‌రి అంచ‌నాల‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా గుర్తుందా శీతాకాలం మూవీ ఉంటుంద‌ని నేను ఖ‌‌చ్ఛితంగా చెప్ప‌గ‌ల‌ను. ఈ మూవీ ప్రేక్ష‌కాద‌ర‌ణ త‌ప్ప‌కుండా పొందుతుంద‌నే నమ్మ‌కం ఉంద‌న్నారు.

ద‌ర్శ‌క‌నిర్మాత నాగ శేఖ‌ర్ మాట్లాడుతూ..

గుర్తుందా శీతాకాలం టైటిల్‌కు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి అనుహ్య‌‌మైన స్పంద‌న ల‌భించడం చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ సినిమాలో హీరో స‌త్య‌దేవ్, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు. అని ఎనౌన్స్ చేసిన వెంట‌నే తెలుగు సినిమా మార్కెట్‌లో వ‌చ్చిన క్రేజ్ మా చిత్ర యూనిట్ అంద‌రిలోనూ ఆనందంతో పాటు బాధ్య‌త‌ను నింపింది. ఇప్పుడు మా ప్రాజెక్ట్ పై తెలుగు ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి, వారంద‌రి ఎక్స్ పెక్టేష‌న్స్‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ సినిమాను చిత్రీక‌రించ‌డానికి మా యూనిట్ స‌భ్యులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో మా చిత్ర షూటింగ్‌ని అధికారికంగా ప్రారంభించాము, అతి త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి, సినిమాను సాధ్య‌మైనంత త్వ‌ర‌‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాము అన్నారు‌.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైవ‌ర మాట్లాడుతూ..

గుర్తుందా శీతాకాలం టైటిల్ విన‌గానే మ‌న‌సుకి ఎంతో హాయిగా అనిపించింది. ఈ సినిమాలో పాటలు విన్నా ఆడియెన్స్‌కు హాయిగా అనిపించేలా మ్యూజిక్ ఇవ్వ‌డానికి నా సాయ‌శక్తులా కృష్టి చేస్తాను. ఈ ప్రాజెక్ట్ లోకి నన్ను తీసుకున్నందుకు ద‌ర్శ‌క‌నిర్మాత నాగ‌శేఖ‌ర్ కు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాద‌ములు తెలియ‌జేస్తున్నాను అని అన్నారు.

డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ..

గుర్తుందా శీతాకాలం ద‌ర్శ‌క‌నిర్మాత నాగశేఖ‌ర్ నాకు ఈ సినిమా ఆఫ‌ర్ ఇచ్చి చాలా పెద్ద ఛాలెంజింగ్ వ‌ర్క్ ఇచ్చారు. ఆయ‌న నా పై ఉంచిన న‌మ్మ‌కానికి ఏ మాత్రం త‌గ్గకుండా సంభాష‌ణ‌లు రాస్తున్నా. ఈ ప్రాజెక్ట్‌కి వ‌ర్క్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు.

Read More:

సీఎంవో సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం

139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన ‘డాల‌ర్ బాయ్’

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu