“సంక్షేమాన్ని అడ్డుకోవ‌డ‌మే బాబు పని”

వైసీపీ స‌ర్కార్ అధికారంలోకి వచ్చిన‌ ఏడాదిన్నరలోపే ఎన్నో సంక్షేమ ప‌థకాల‌ను ప్ర‌జ‌ల కోసం ప్ర‌వేశ‌పెట్టింద‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 2:41 pm, Fri, 28 August 20
"సంక్షేమాన్ని అడ్డుకోవ‌డ‌మే బాబు పని"

వైసీపీ స‌ర్కార్ అధికారంలోకి వచ్చిన‌ ఏడాదిన్నరలోపే ఎన్నో సంక్షేమ ప‌థకాల‌ను ప్ర‌జ‌ల కోసం ప్ర‌వేశ‌పెట్టింద‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. పేద ప్రజల వెత‌లు తీర్చ‌డానికి, వారికి సంక్షేమ పథకాలు అందించడానికి తాము ప్రయత్నిస్తుంటే… ప్రతిపక్షాలు అడ్డు త‌గుతున్నాయ‌ని మంత్రి ఆరోపించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు నూతన మార్కెట్ యార్డ్ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో మంత్రి పేర్ని నానితో కలిసి కొడాలి నాని పాల్గొన్నారు.

Gudlavalleru Market Committee swearing ceremony

మాజీ సీఎం చంద్రబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన మనుషులను పెట్టుకొని జగన్ స‌ర్కార్ చేస్తున్న ప్రతి కార్యక్రమానికి అడ్డుతగిలేలా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కుటిల య‌త్నాల‌ను కార్యకర్తలు తిప్పికొట్టాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.

Also Read : బెజ‌వాడ‌లో ఇద్ద‌రు రౌడీ షీట‌ర్లు అరెస్ట్, మార‌ణాయుధాలు స్వాధీనం