జేఈఈ నీట్ పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రమాదం అంటున్న ఆరు రాష్ట్రాలు

జాతీయ జేఈఈ, నీట్ పరీక్షలు కేంద్రం, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు ప్రమాదమంటున్నాయి బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు, లేదు లేదు ఇప్పటికే అలస్యమైంది.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాల్సిందే అంటోంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చినప్పటికీ మరోసారి సమీక్షించాలంటూ కోర్టును ఆశ్రయించాయి ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు.

జేఈఈ నీట్ పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రమాదం అంటున్న ఆరు రాష్ట్రాలు
Follow us

|

Updated on: Aug 28, 2020 | 2:06 PM

జాతీయ జేఈఈ, నీట్ పరీక్షలు కేంద్రం, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు ప్రమాదమంటున్నాయి బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు, లేదు లేదు ఇప్పటికే అలస్యమైంది.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాల్సిందే అంటోంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చినప్పటికీ మరోసారి సమీక్షించాలంటూ కోర్టును ఆశ్రయించాయి ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు.

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ వాయిదా కోసం ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు సంయుక్తంగా శుక్రవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. జేఈఈ, నీట్ నిర్వహణపై ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరారు. ఒక‌వైపు కరోనా మహమ్మారి, మరోవైపు భారీ వర్షాలు, వరదల వల్ల తమ తమ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయిని పటిషన్ లో పేర్కొన్నారు. పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ఆరు రాష్ట్రాల ముంత్రులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల పాలిత ఏడు రాష్ట్రాల సీఎంల ఆన్‌లైన్ సమావేశం జరిగింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాగెల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి కూడా పాల్గొన్నారు. జీఈఈ, నీట్ వాయిదాకు ఉమ్మడిగా పోరాడాలని, సుప్రీంకోర్టులో సమీక్ష కోరాలని ఈ సందర్భంగా సీఎంలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆరు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు సంయుక్తంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

జేఈఈ, నీట్ వాయిదాకు పలు రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ పరీక్షలను ఈసారి నిర్వహించాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దీంతో జేఈఈ, నీట్ నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 85 శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ జరుగనున్నాయి.