తెలుగు బిగ్‌బాస్ షో చూపిస్తూ మెదడుకు ఆపరేషన్.. డాక్టర్ల ప్రయత్నం విజయవంతం
ప్రస్తుతం జరుగుతోన్న తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో రేటింగ్ కోసం నిర్వాహకులు తెగ కష్టాలు పడుతున్నారు. రకరకాలు ప్రమోషన్లు చేస్తూ, భారీ పారితోషకంతో గెస్టులు తీసుకువస్తూ...
ప్రస్తుతం జరుగుతోన్న తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో రేటింగ్ కోసం నిర్వాహకులు తెగ కష్టాలు పడుతున్నారు. రకరకాలు ప్రమోషన్లు చేస్తూ, భారీ పారితోషకంతో గెస్టులు తీసుకువస్తూ బజ్ తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గుంటూరు జిల్లాలో డాక్టర్లు చేసిన అరుదైన ఆపరేషన్ ద్వారా షోకు విపరీతమైన ప్రచారం దక్కింది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన బత్తుల వరప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా వర్క్ చేస్తున్నాడు. అతనికి నాలుగేళ్ల క్రితం మెదడులో కణితి ఏర్పడటంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి ఆపరేషన్ చేసి తొలగించారు. ఆ తరువాత కొంతకాలం ఆరోగ్యంగానే ఉన్న వరప్రసాద్..ఇటీవల ఫిట్స్ వచ్చి పడిపోవడంతో.. గుంటూరు నగరంలోని బ్రిందా న్యూరో సెంటర్‌కు తరలించారు. అక్కడ బాధితుడికి పలు పరీక్షలు చేసిన సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి.. వరప్రసాద్ మెదడులోని ఫంక్షనల్ ఏరియాలో 3 సెంటీమీటర్ల సైజులో ట్యూమరర్ ఉన్నట్లు యం.ఆర్.ఐ. పర్‌ఫ్యూజన్ స్కాన్ ద్వారా గుర్తించారు.
అయితే ఆపరేషన్ చేయడానికి ఆ కణితి భాగంలో మెడ, కాలు భాగానికి సప్లయి అయ్యే నరాలు ఉండటంతో వర ప్రసాద్‌కి అవేక్ బ్రెయిన్ సర్జరీ నిర్వహించాల్సిన అవసరం వచ్చిందది. బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం అరుదైన ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేశారు డాక్టర్లు. ఈ శస్త్ర చికిత్స జరిగినంతసేపు రోగి సహకరించాల్సి ఉంటుంది కాబట్టి..అందుకే మెదడు ప్రాంతానికే మత్తు మందు ఇచ్చి మిగతా శరీరమంతా స్పృహలో ఉండేటట్లు చూశారు. ఈ క్రమంలో అతడు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా తనకి ఇష్టమైన నాగార్జున ‘బిగ్ బాస్ ’ షోని ఆపరేషన్ థియేటర్‌లో లాప్ ట్యాప్‌లో చూపించారు డాక్టర్లు. కొంతసేపు బిగ్ బాస్.. అనంతరం అవతార్ సినిమాలు చూస్తూ డాక్టర్లకు సహకరించాడు వరప్రసాద్.
సుమారు గంటన్నర పాటు సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ డి.శేషాద్రి శేఖర్, బొమ్మిశెట్టి త్రినాథ్, శ్రీనివాసరెడ్డి అండ్ టీమ్ శ్రమించి ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నాడని ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేవని డాక్టర్లు తెలిపారు.
Also Read :
సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం
ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !
కోవిడ్ బారినపడ్డ జూనియర్ ట్రంప్..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్