ఆరేళ్లుగా ప్రేమించి హ్యాండిచ్చాడు.. కరోనా పేరుతో ఇంటికి వెళ్లి కల్యాణం చేసుకున్నాడు..

ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఎన్నో కళలు కన్నారు.. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకున్నారు..

ఆరేళ్లుగా ప్రేమించి హ్యాండిచ్చాడు.. కరోనా పేరుతో ఇంటికి వెళ్లి కల్యాణం చేసుకున్నాడు..

ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఎన్నో కళలు కన్నారు.. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకున్నారు.. ఇంతలో ప్రేమికుడికి కరోనా సోకగా సొంత గ్రామానికి వెళ్లాడు. కట్ చేస్తే బంధువుల అమ్మాయిని పెళ్లిచేసుకొని ప్రియురాలికి హ్యాండిచ్చాడు..పెద్ద పంజాణి మండలానికి చెందిన యువతి బెంగుళూరులో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లెకు చెందిన గణేష్‌ పని చేసేవాడు. ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. అయితే ఇటీవల గణేశ్ కరోనా లక్షణాలతో స్వగ్రామానికి వచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు అతడి కుటుంబ సభ్యులు బంధువుల అమ్మాయితో అతడికి పెళ్లి నిశ్చయించారు..
గణేశ్ స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్నయువతి వెంటనే మిట్టమీద కురప్పల్లెకు వచ్చింది.. కానీ అప్పటికే ప్రియుడి పెళ్లి జరిగిపోయింది. గురువారం రాత్రి వధువు ఇంటి వద్ద మొదటి రాత్రి జరుగుతుందని తెలిసి ప్రియురాలు అక్కడికి వెళ్లింది. తనను ఎందుకు మోసం చేశావంటూ ప్రియుడిని నిలదీసింది. అతడి బంధువులు ఆమెపై దౌర్జన్యం చేశారు. దీంతో యువతి పెద్ద పంజాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు విషయం తెలుసుకున్న పెళ్లిజంట మొదటి రాత్రి వాయిదా వేసి ఎస్కేప్ అయ్యారు. దీంతో ఆ యువతి ఎలాగైనా గణేశ్‌ను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.