తమ్మినేనికి తప్పిన ముప్పు.. రోడ్ యాక్సిడెంట్‌లో తృటిలో ఎస్కేప్.. పొలాల్లోకి దూసుకెళ్ళిన స్పీకర్ కారు

ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఘోరం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. స్పీకర్ తమ్మినేని కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన ఓ ఆటో...

తమ్మినేనికి తప్పిన ముప్పు.. రోడ్ యాక్సిడెంట్‌లో తృటిలో ఎస్కేప్.. పొలాల్లోకి దూసుకెళ్ళిన స్పీకర్ కారు
Follow us
Rajesh Sharma

|

Updated on: Nov 21, 2020 | 6:31 PM

Tammineni Sitaram escapes in Road Accident: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఘోరం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. స్పీకర్ తమ్మినేని కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన ఓ ఆటో బీభత్సం సృష్టించింది. ఆటోను తప్పించబోయిన స్పీకర్ కారు పొలాల్లోకి దూసుకెళ్ళింది. ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న తర్వాత తిరుగు ప్రయాణమైన స్పీకర్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా వాకలవలస, వంజంగి గ్రామాల గుండా స్పీకర్ తమ్మినేని కాన్వాయ్ వెళుతుండగా ప్రమాదం జరగింది. పాలకొండ రోడ్డులో కాన్వాయ్ వెళుతుండగా.. ఓ ఆటో అందులోకి చొరబడింది. ఆ ఆటోను తప్పించబోయిన స్పీకర్ వాహనం పొలాల్లోకి దూసుకెళ్ళింది. శ్రీకాకుళం నుచి ఆముదాలవలసకు స్పీకర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్ని బోల్తా పడిన ఆటోలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారులోంచి దిగిన స్పీకర్.. గాయపడిన వారిని దగ్గరుండి మరీ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలింపజేశారు. ప్రత్యామ్నాయ వాహనంలో స్పీకర్ తమ్మినేని తన ఇంటికి వెళ్లిపోయారు.

ALSO READ: పార్టీ మారితే చెప్పే పోతానంటున్న మాజీ మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం