‘సర్కారు వారి పాట’కు క్లాప్ కొట్టిన సితార, కెమెరా స్విచ్ ఆన్ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమా ‘సర్కారు వారి పాట’ పూజా కార్యక్రమం కొంచెం సేపటి క్రితం హైదరాబాద్ లో జరిగింది. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ […]

'సర్కారు వారి పాట'కు క్లాప్ కొట్టిన సితార, కెమెరా స్విచ్ ఆన్ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమా ‘సర్కారు వారి పాట’ పూజా కార్యక్రమం కొంచెం సేపటి క్రితం హైదరాబాద్ లో జరిగింది. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్ టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘గీత గొవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ను మహేష్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడిస్తూ ప్రీ లుక్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి..

సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్
పిఆర్ఓ: బి.ఏ. రాజు
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.