సోలో హీరోగా గెటప్ శ్రీను, సూడో రియలిజం జాన‌ర్‌లో సినిమా, హీరోగా సుడి మారేనా ?

గెట‌ప్‌ శ్రీ‌ను హీరోగా సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'రాజు యాద‌వ్‌'. ఒక టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే ఈ చిత్రం స‌హ‌జ‌సిద్ధ‌మైన పాత్ర‌ల‌తో...

సోలో హీరోగా గెటప్ శ్రీను, సూడో రియలిజం జాన‌ర్‌లో సినిమా, హీరోగా సుడి మారేనా ?
Follow us

|

Updated on: Nov 21, 2020 | 2:14 PM

గెట‌ప్‌ శ్రీ‌ను హీరోగా సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రాజు యాద‌వ్‌’. తెలుగులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల రూపొందించిన ‘నీది నాది ఒకే క‌థ‌’, ‘విరాట‌ప‌ర్వం’ చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కృష్ణ‌మాచారి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. ఈ సినిమాలో గెట‌ప్ శ్రీ‌ను స‌ర‌స‌న నాయిక‌గా అంకిత క‌ర‌త్ న‌టిస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె. చంద్ర క్లాప్ నిచ్చారు. డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల‌, ప్ర‌ముఖ‌ నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ సంయుక్తంగా స్క్రిప్టును ద‌ర్శ‌కుడు కృష్ణ‌మాచారికి అంద‌జేశారు.

ఒక టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే ఈ చిత్రం స‌హ‌జ‌సిద్ధ‌మైన పాత్ర‌ల‌తో, ఆర్గానిక్ మేకింగ్‌తో ఉంటుంద‌ని కృష్ణ‌మాచారి తెలిపారు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు దూరంగా, వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా, స‌మాజంలో మ‌నం చూసే ఎన్నో పాత్ర‌ల‌కు, ఘ‌ట‌న‌ల‌కు రిప్ర‌జెంటేటివ్‌లా ఉంటూ, స‌గ‌టు కుటుంబంలోని వైరుధ్య మ‌న‌స్త‌త్వాలు, వారి ఊహ‌లు, కోరిక‌లు, ప్ర‌యాణం, చివ‌ర‌గా డెస్టినీ ఏమిట‌నేదే ఈ సినిమా అని ఆయ‌న చెప్పారు.

న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న క‌థ కావ‌డంతో, త‌న న‌ట‌న‌తో పాత్ర‌కు ప్రాణం పోసే గెట‌ప్ శ్రీ‌నును ముఖ్య‌పాత్ర కోసం అడ‌గ‌టం జరిగిందని, ఆయ‌న క‌థ విన్న వెంట‌నే ఒప్పుకోవ‌డమే కాకుండా, ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా ఆయ‌న త‌న బాడీని మ‌లుచుకుంటున్నారని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం ద్వారా గెట‌ప్ శ్రీ‌నులోని న‌టుడిని కొత్త కోణంలో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు కృష్ణ‌మాచారి చెప్పారు. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్‌, సాక్ష్యం, క‌నులు క‌నుల‌ను దోచాయంటే లాంటి హిట్ సినిమాల‌కు సంగీతం స‌మ‌కూర్చిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ‘రాజు యాద‌వ్‌’కు స్వ‌రాలు అందిస్తున్నారు. డిసెంబ‌ర్ మొద‌టి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుతామ‌ని నిర్మాత ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్

పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..