గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-ట్రక్ ఢీ.. ఏడుగురు వ్యక్తుల సజీవదహనం..
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. రెండు వాహనాలు ఢీకొని ఏడుగురు సజీవదహనమయ్యారు.
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. రెండు వాహనాలు ఢీకొని ఏడుగురు సజీవదహనమయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ఘరో దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్ వెహికల్ కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు వ్యక్తులు అక్కడిక్కడే సజీవదహనం అయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్ వైపు వస్తున్న కారును టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక ఎస్పీ హెచ్‌సీ దోషీ దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమ్మితం సురేంద్రనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Seven people killed in collission between a truck and a car in Patdi, says HP Doshi, Deputy SP, Surendranagar district, Gujarat pic.twitter.com/OvAdzbrmjS
— ANI (@ANI) November 21, 2020