Watch: ఏంది భయ్యా అది.. మేకనో, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమికొట్టావ్..! నీ గుండె ధైర్యానికి..
అదిగో పులి అంటే చాలు.. అక్కడే మనకు పై ప్రాణాలు పైకి పోయినంత పనవుతుంది..ఎందుకంటే.. పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను చూస్తే అడవి జంతువులతో పాటు మనుషులు సైతం హడలెత్తిపోతుంటాం. ఇక అలాంటిది అవి దగ్గరకొస్తే ఇంకేమైనా ఉందా.. గుండె ఆగిపోతుంది. కానీ, ఓ ఫారెస్ట్ గార్డ్ మాత్రం సింహాన్ని పెంపుడు జంతువు కంటే తక్కువ చేసి చూస్తున్ఆనడు. చిన్న కర్ర పుల్ల సాయంతో ఓ భారీ సింహాన్ని తరిమికొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.
కింగ్ ఆఫ్ ది జంగిల్ సింహం..అవును అడవికి రారాజు సింహాం అంటారు.. అది నడిచే రాజసం, దాని వేట చూస్తే గుండెళ్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సింహం గర్జన వినపడితే చాలు.. అడవి మొత్తం వణికిపోతుంది. కానీ, ఎక్కడైనా ఓ మనిషి సింహాన్ని ఓ కుక్కపిల్లలా లేదంటే, ఆవునో, ఎద్దునో తరిమికొట్టినట్టుగా ప్రవర్తించటం ఎప్పుడైనా చూశారా..? వామ్మో అదేలా సాధ్యం అనుకుంటున్నారా..? కానీ, ప్రస్తుతం, అలాంటి వీడియో ఒక వీడియో ఇంటర్ నెట్ వేదికగా ప్రజలను కలవరపెడుతోంది. అందులో ఒక వ్యక్తి కొన్ని అడుగుల దూరం నుండి చేతిలో కర్రను చూపుతూ సింహాన్ని తరిమికొడుతున్నాడు..ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే..ఆ సింహం కూడా భయపడి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ షాకింగ్ దృశ్యం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగినట్టుగా తెలిసింది. అక్కడ ఒక సింహం రైల్వే క్రాసింగ్‌పై నిలబడి ఉంది. ఆ సమయంలో ఒక రైలు రాబోతుంది. అయితే అది చూసిన వెంటనే ఓ అటవీ కార్మికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ సింహాన్ని తరిమికొట్టాడు. చేతిలో చిన్న కర్ర పట్టుకుని ఓ ఆవు, మేక, ఎద్దునో తరిమినట్టుగా దూరంగా తొలుతున్నాడు. దాంతో ఆ సింహం కూడా అతనికి భయపడి దూరంగా వెళ్తుంది. ఈ సమయంలోరైల్వే గేట్ తెరవడానికి వేచి ఉన్న వ్యక్తులు ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను వీడియో తీశారు. దానిని ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది.
వీడియో ఇక్కడ చూడండి..
इस वीडियो में शेर 🦁 कौन है
रेलवे ट्रैक पर आया शेर, गाय की तरह हांकने लगा वनकर्मी pic.twitter.com/IQujSleUA1
— anil singh chauhan (@anilsinghvatsa) January 9, 2025
@anilsinghvatsa హ్యాండిల్‌తో వీడియోను షేర్ చేయగా, దీనికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. అటవీశాఖ ఉద్యోగి ధైర్యం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇది మూర్ఖపు చర్య అని కూడా కొందరు పేర్కొన్నారు. సింహం దాడి చేసి ఉంటే మేధస్సు అంతా వృధాగా పోయేదని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ఇది ధైర్యం కాదు, మూర్ఖత్వం అని మరొక వినియోగదారు అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి