గుజరాత్‌లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన అగ్ని కీలలు
గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వల్సాద్ ఏరియాలోని ఓ ప్లాస్టిక్ ఉత్పత్తుల కంపెనీలో ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా...

Fire Breaks Out : గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వల్సాద్ ఏరియాలోని ఓ ప్లాస్టిక్ ఉత్పత్తుల కంపెనీలో ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఫైరింజన్‌ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీపావళి పండుగ సెలవులు ఉండటంతో కార్మికులకు సెలవులు ప్రకటించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కొద్ది మంది ఆఫీసు సిబ్బది ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వారంతా క్షేమంగా ఉండే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
ఈ ఘటనలో ఆస్తినష్టం భారీగా జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమై ఉండవచ్చు అనే వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
#WATCH | Gujarat: Fire breaks out at a plastic manufacturing unit in Valsad; fire fighting operations underway. pic.twitter.com/2ikvoy2TXz
— ANI (@ANI) November 14, 2020