నియంత్రణ రేఖ వద్ద పాక్ పై ప్రతీకారం తీర్చుకున్న ఇండియన్ ఆర్మీ, 8 మంది సైనికుల మృతి, బంకర్లు ధ్వంసం

నియంత్రణ రేఖ వద్ద పాక్ పై ప్రతీకారం తీర్చుకున్న ఇండియన్ ఆర్మీ, 8 మంది సైనికుల మృతి, బంకర్లు ధ్వంసం

జమ్మూ కాశ్మీర్ వాస్తవాధీన రేఖ వద్ద శుక్రవారం భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల సమరంలో భారత జవాన్లదే పైచేయి అయింది.

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Nov 14, 2020 | 3:29 PM

జమ్మూ కాశ్మీర్ వాస్తవాధీన రేఖ వద్ద శుక్రవారం భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల సమరంలో భారత జవాన్లదే పైచేయి అయింది. పాకిస్తాన్ దళాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 8 మంది పాక్ సైనికులు మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో  ఆ దేశ సైనిక శిబిరాలు, బంకర్లు ధ్వంసమయ్యాయి. ఆర్మీ రిలీజ్ చేసిన వీడియోల్లో.. ఇవి మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. కాల్పుల విరమణను అతిక్రమించి యూరి, గురేజ్ సెక్టర్లలో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో 5 గురు జవాన్లు సహా 11 మంది మృతి చెందారు. దీంతో భారత జవాన్లు ప్రతీకారేచ్చతో రగిలిపోయారు. పూంఛ్ జిల్లాలోనూ పాకిస్థాన్ దళాలు యథేచ్చగా గ్రామాల్లో చొరబడి ఫైరింగ్ చేశాయని, ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారని భారత సైన్యం తెలిపింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu