చలికి వణుకుతున్న యాచకుడికి గరం కోటు ఇద్దమని వెళ్లిన ఓ డీఎస్పీ షాక్ కి గురయ్యాడు..!

చలికి వణుకుతున్న యాచకుడికి గరం కోటు ఇద్దమని వెళ్లిన ఓ డీఎస్పీ షాక్ కి గురయ్యాడు..!

స్వార్థపూరితమైన మనసుతో మానవత్వాన్ని మరిచిపోతున్నాడు.ఒక్కోసారి మన ఎదుటనున్నవారు మనవాళ్లైన కనికరం చూపలేనంతగా.. దీంతో అందరు ఉండికూడా అనాథలుగా

Balaraju Goud

|

Nov 14, 2020 | 2:45 PM

మానవత్వం.. సృష్టిలో ఈ జీవికి లేని వరం. తోటి వ్యక్తికి తనవంతు సాయం అందిస్తూ.. జీవనం సాగించాలన్నది మనిషి బాధ్యత. అయితే ప్రస్తుత కాలంతో మనిషి మాత్రం స్వార్థపూరితమైన మనసుతో మానవత్వాన్ని మరిచిపోతున్నాడు.ఒక్కోసారి మన ఎదుటనున్నవారు మనవాళ్లైన కనికరం చూపలేనంతగా.. దీంతో అందరు ఉండికూడా అనాథలుగా మారుతున్నారు. ఇటువంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. రోడ్డు పక్కగా ఉన్న చలితో వణుకుతున్న ఒక యాచకుణ్ణి చూసిన ఓ డీఎస్పీ అతనిని చేరదీసి సపర్యలు చేశాక, అతనిని దగ్గరనుంచి చూసి షాకయ్యారు. యాచకునిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి తన బ్యాచ్ ఆఫీసర్ అని తెలిసి నివ్వరపోయాడు.

గ్వాలియర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డీఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ పోలీసు వాహనంలో భదౌరియా ఝాన్సీ రోడ్డు మీదుగా వెళుతున్నారు. ఇంతలో అతనికి వాటికా ఫుట్‌పాత్ దగ్గర చలికి వణుకుతున్న ఒక యాచకుడు కనిపించాడు. వెంటనే వాహనాన్నిఆపి అతని దగ్గరకు వెళ్లి, చలితో వణుకుతున్న అతనికి డీఎస్పీ రత్నేష్ తన చలి కోటు తీసి ఇచ్చారు. అతని బాగోగులు తెలుసుకునేందుకు అతనితో మాట్లాడటంతో అ వ్యక్తి యాచకుడు కాదని తన తోటి పోలీసు అధికారి అని తెలుసుకుని షాకయ్యారు. అతని పేరు మనీష్ మిశ్రా. 1999 బ్యాచ్ పోలీసు అధికారి అని తెలుసుకున్న డీఎస్పీ నివ్వెరపోయాడు. అతను ఎస్పీగా పలు పోలీసు స్టేషన్లలో పనిచేశారు. 2005లో చివరిగా దతియాలో పనిచేశారు. తరువాతి కాలంలో అతని మానసిక పరిస్థితి సరిగాలేక కనిపించకుండాపోయాడు. ఇంట్లోని వారు అతనికి చికిత్స అందించారు.

అయితే అ తరువాత మనీష్ మిశ్రా ఇల్లు విడిచి వెల్లిపోయారు. గత పదేళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఇంట్లోని వారు ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. అప్పటి నుంచి మనీష్ యాచకునిగా కాలం వెళ్లదీస్తున్నాడు. యాచకుడి కథనంతా తెలుసుకున్న డీఎస్పీ రత్నేష్ ఆ వ్యక్తిని చేరదీసి మామూలు మనిషిగా మార్చించాడు డీఎస్పీ రత్నేష్. అనంతరం అతడిని ఒక స్వచ్ఛంద సంస్థ దగ్గరకు తరలించారు. అక్కడ మనీష్ మిశ్రా వైద్య చికిత్స కూడా పొందుతున్నాడు. ఇకపై అతని అలనాపాలనా తానూ తీసుకుంటున్నట్లు రత్నేష్ తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu