కొద్ధి గంటల్లో పెళ్లి.. కరోనాతో మృతి చెందిన వరుడు

కరోనా లక్షణాలు ఏమాత్రం లేకుండానే వైరస్ బారిన పడుతున్నారు. అనుమానంతో టెస్టులు చేయించుకుంటే గానీ బయటపడడంలేదు. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తులు సైతం కొవిడ్ నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం సృష్టించింది. కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న వరుడు కరోనా కాటుకు బలయ్యాడు.

కొద్ధి గంటల్లో పెళ్లి.. కరోనాతో మృతి చెందిన వరుడు
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 06, 2020 | 1:46 PM

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా విస్తరిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్య కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా లక్షణాలు ఏమాత్రం లేకుండానే వైరస్ బారిన పడుతున్నారు. అనుమానంతో టెస్టులు చేయించుకుంటే గానీ బయటపడడంలేదు. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తులు సైతం కొవిడ్ నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం సృష్టించింది. కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న వరుడు కరోనా కాటుకు బలయ్యాడు.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ యువకుడు కరోనా సోకి చికిత్స పొందుతూ మృతిచెందారు. కొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి అతను కరోనా వైరస్ ధాటికి మరణించారు. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన యువకుడు (28) గతనెల 28న తీవ్ర జ్వరంతో బాధపడుతూ స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంను సంప్రదించారు. ఆమె కరోనా పరీక్షలకు నమూనాలు సేకరించారు. ఇంతలో యువకుడు అనారోగ్యానికి గురయ్యాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. తెల్లవారితే పెళ్లి జరగాల్సిన యువకుడు మృతి పట్ల ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇటీవలే యువకుడికి పెళ్లి కుదిరింది. బుధవారం పెళ్లిచేయాలని పెద్దలు నిశ్చయించారు. మృతుడికి తల్లిదండ్రులు, చెల్లెలు ఉన్నారు. తల్లి పక్షవాతంతో మంచాన పడ్డారు. తండ్రి వయసు మీద పడి ఇంటికే పరిమితమయ్యారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న యువకుడి మరణాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.