నిరుద్యోగులకు ఉపాధి కల్పనే మా లక్ష్యం: మహారాష్ట్ర గవర్నర్
టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్.. టాటా స్ట్రైవ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మేట్‌పల్లిలోని అమ్మక్కపేట వైఎస్‌ఆర్ కాలనీలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని.. ఒక్కొక్కరికి రూ. 50వేలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి తీరుతామని మై హోం గ్రూప్ అధినేత […]

టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్.. టాటా స్ట్రైవ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మేట్‌పల్లిలోని అమ్మక్కపేట వైఎస్‌ఆర్ కాలనీలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని.. ఒక్కొక్కరికి రూ. 50వేలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి తీరుతామని మై హోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు హామీ ఇచ్చారు. ప్రపంచ దేశాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే గవర్నర్ విద్యాసాగర్ రావుగారి ఆలోచన అని ఆయన చెప్పారు. ఇలాంటి శిక్షణ కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఉండే నిరుద్యోగులకు ఫిట్టర్, ఎలక్ట్రికల్, సోలార్ రంగాల్లో నిరుద్యోగులకు శిక్షణ లభిస్తుందని తెలిపారు.