ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ-గవర్నర్ తమిళిసై
ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ ఎదిగేందుకు అపారమైన అవకాశాలున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ అన్నారు. నూతన విద్యావిధానం , కార్యాచరణపై గవర్నర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలతో డిజిటల్ మీటింగ్ నిర్వహించారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనతో పిల్లల్లో మానసిక వికాసం పెంపొందుతుందన్నారు. భారతీయ మూలాలను గౌరవించే విద్యావిధానానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని వ్యాఖ్యానించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ప్రోత్సహించేలా నూతన విద్యావిధానం ఉందన్నారు. సమూల సంస్కరణలతో 21వ శతాబ్దపు విద్యావిధానానికి శ్రీకారం చుట్టారని […]
ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ ఎదిగేందుకు అపారమైన అవకాశాలున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ అన్నారు. నూతన విద్యావిధానం , కార్యాచరణపై గవర్నర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలతో డిజిటల్ మీటింగ్ నిర్వహించారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనతో పిల్లల్లో మానసిక వికాసం పెంపొందుతుందన్నారు. భారతీయ మూలాలను గౌరవించే విద్యావిధానానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని వ్యాఖ్యానించారు.
నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ప్రోత్సహించేలా నూతన విద్యావిధానం ఉందన్నారు. సమూల సంస్కరణలతో 21వ శతాబ్దపు విద్యావిధానానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఈ విద్యావిధానంతో ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా భారత్ ఎదుగుతుందని అన్నారు. భవిష్యత్ తరాలను ప్రపంచ నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే (NPE2020) ఎన్‌పీఈ 2020 లక్ష్యమని స్పష్ట చేశారు. భారత్ పునర్వైభవానికి విద్యా నిపుణులు కృషిచేయాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.