ఆరో రోజూ దిగొచ్చిన పసిడి
వరుసగా ఆరో రోజూ పసిడి ధరలు దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. MCXలో గురువారం పదిగ్రాముల బంగారం..
వరుసగా ఆరో రోజూ పసిడి ధరలు దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. MCXలో గురువారం పదిగ్రాముల బంగారం 435 రూపాయలు తగ్గి 51,344కు దిగింది. ఇక వెండి కిలోకి 884 రూపాయలు తగ్గి 66,645 రూపాయలకు దిగివచ్చింది. ఇన్వెస్టర్ల చూపు షేర్ మార్కెట్ వైపు పడ్డం.. ఈక్విటీ మార్కెట్లు లాభపడటంతో మదుపుదారుల నుంచి బంగారానికి డిమాండ్ తగ్గిందని బులియన్ వర్గాలు అంచనా వేశారు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వెలువడేవరకూ బంగారం ధరల్లో ఈ హెచ్చుతగ్గులు తప్పవంటున్నారు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్.