మంత్రి కేటీఆర్ తో హెచ్‌సిఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ భేటీ

ఉప్పల్‌ స్టేడియం లీజు పీరియడ్‌ను పెంచాలని, ఆస్తిపన్ను తగ్గించాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సిఏ) అధ్యక్షుడు అహ్మద్‌ అజారుద్దీన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు గురువారం హెచ్‌సిఏ బృందం రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లతో సమావేశమయ్యారు.

మంత్రి కేటీఆర్ తో హెచ్‌సిఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ భేటీ
Follow us

|

Updated on: Aug 27, 2020 | 8:09 PM

ఉప్పల్‌ స్టేడియం లీజు పీరియడ్‌ను పెంచాలని, ఆస్తిపన్ను తగ్గించాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సిఏ) అధ్యక్షుడు అహ్మద్‌ అజారుద్దీన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు గురువారం హెచ్‌సిఏ బృందం రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లతో సమావేశమయ్యారు. జిల్లా, గ్రామీణ స్థాయిలో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు, గ్రామీణ క్రీడాకారులను ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సాట్స్‌తో కలిసి పనిచేస్తోందని అజారుద్దీన్‌ తెలిపారు. హెచ్‌సిఏ చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించే క్రికెట్ ను విస్తరించాలని మంత్రి సూచించారు. అణిముత్యాలాంటి క్రికెటర్లను తయారు చేసి దేశానికి అందించాలని తెలిపారు.