Gold Rate Today: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా పెరిగిన పసిడి ధరలు ఇలా ఉన్నాయి.. ఈసారి ఎంతంటే ?

దేశంలో పసిడి ధర మళ్లీ పెరిగింది. గత రెండు రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన బంగారం ధర జనవరి 2న మరోసారి పెరిగింది.

Gold Rate Today: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా పెరిగిన పసిడి ధరలు ఇలా ఉన్నాయి.. ఈసారి ఎంతంటే ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2021 | 7:24 AM

దేశంలో పసిడి ధర మళ్లీ పెరిగింది. గత రెండు రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన బంగారం ధర జనవరి 2న మరోసారి పెరిగింది. కొత్త సంవత్సరం వేళ జనవరి 1న బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ జనవరి 2న పసిడి ధర అమాంతం పెరిగింది. దాదాపు రూ.100 పెరిగింది. దేశీయ మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.51,060కు చేరింది.

భారత్‏లోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.100 పెరిగి.. రూ.46,800కు చేరింది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి.. రూ.51,060కు చేరింది. ఇక ముంభై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51,560కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,860కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.53,310కు చేరింది. చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.51,560 వరకు పెరిగింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,060కు చేరింది.