Today Gold Rates: పసిడి పరుగులకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

Today Gold Rates:  బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. పసిడి పరుగులకు బ్రేక్ పడింది. వరుసగా ఆరు రోజులుగా పెరుగుతున్న

Today Gold Rates: పసిడి పరుగులకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 07, 2021 | 8:07 AM

Today Gold Rates:  బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. పసిడి పరుగులకు బ్రేక్ పడింది. వరుసగా ఆరు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు బుధవారం సాయంత్రం నాటికి కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 71 తగ్గింది. ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 51,125 పలుకుతోంది. ఇక అంతకు ముందురోజు బంగారం ధర 10 గ్రాములకు రూ. 51,196 ఉంది.

ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,360 గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరసుగా పెరుగుతున్నాయి. ఔన్స్ బంగారం 1,949 అమెరికన్ డాలర్లు పలుకుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also read:

High Court Of Telangana: నేడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ హిమా కోహ్లీ..

Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్