Central Govt New Draft Bill: ఇకపై సిగిరెట్లు అలా లభించవు.. సిద్ధమవుతోన్న కేంద్రం కొత్త బిల్లు..
Soon Loose Cigarettes To Be Banned: దేశంలో సిగిరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడానికి కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ వేదికగా...
Soon Loose Cigarettes To Be Banned: దేశంలో సిగిరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడానికి కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ వేదికగా కొత్త బిల్లు తీసుకురానుంది. ఇందు కోసం కేంద్రం ఇప్పటికే పలు అంశాలతో ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. సిగిరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం.. ఇకపై పొగ తాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచనున్నారు. 21 ఏళ్లలోపు వారికి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను తీవ్ర నేరంగా పరిగణించనున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ. లక్ష జరిమానాతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా విడి సిగరెట్ల విక్రయంపై నిషేధాన్ని విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పొగతాగడం కోసం రెస్టారెంట్లు, విమానాశ్రయాల్లో ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ప్రత్యేక గదులు, స్థలాలను మూసివేయాలని నిర్ణయించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు జరపకూడదనే అంశాన్ని కూడా ఈ డ్రాఫ్ట్ బిల్లులో చేర్చారు.