ఆర్కే స్టూడియోస్‌ను చేజిక్కించుకున్న గోద్రేజ్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కపూర్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక అర్కే స్టూడియోస్‌ను గోద్రేజ్ సంస్థ చేజిక్కించుకుంది. శుక్రవారం దీనికి సంబంధించి లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. దీని ధర ఎంతనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మరమ్మతులు చేయించాలనుకున్నప్పటికీ దీన్ని అమ్మకానికి పెట్టినట్లు స్టూడియో యాజమాన్యం అనూహ్యంగా ప్రకటించింది. దీన్ని కొనుగోలు చేయడానికి ఎన్నో ప్రముఖ కంపెనీలు పోటీ పడినప్పటికీ చివరికి ఇది గోద్రేజ్‌కు దక్కింది. […]
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కపూర్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక అర్కే స్టూడియోస్‌ను గోద్రేజ్ సంస్థ చేజిక్కించుకుంది. శుక్రవారం దీనికి సంబంధించి లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. దీని ధర ఎంతనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మరమ్మతులు చేయించాలనుకున్నప్పటికీ దీన్ని అమ్మకానికి పెట్టినట్లు స్టూడియో యాజమాన్యం అనూహ్యంగా ప్రకటించింది. దీన్ని కొనుగోలు చేయడానికి ఎన్నో ప్రముఖ కంపెనీలు పోటీ పడినప్పటికీ చివరికి ఇది గోద్రేజ్‌కు దక్కింది. ఈ స్టూడియోస్‌ను ముంబయిలోని చెంబూరులో 2.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1970, 80ల నాటి కాలంలో ఎన్నో చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నాయి.