ఒడిశాను వణికించి.. బంగ్లాదేశ్ దిశగా పయనం
ఉగ్రరూపం దాల్చిన ‘ఫొని’ తుఫాన్.. తీవ్ర వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ దిశగా దూసుకెళ్తోంది. శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కేంద్రీకృతమైన సూపర్ సైక్లోన్ ‘ఫొని’.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మధ్యాహ్నానికి బంగ్లాదేశ్‌ను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు శుక్రవారం ఒడిశాలో తీరాన్ని దాటిన ‘ఫొని’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ కారణంగా ఒడిశాలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. […]
ఉగ్రరూపం దాల్చిన ‘ఫొని’ తుఫాన్.. తీవ్ర వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ దిశగా దూసుకెళ్తోంది. శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కేంద్రీకృతమైన సూపర్ సైక్లోన్ ‘ఫొని’.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మధ్యాహ్నానికి బంగ్లాదేశ్‌ను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు శుక్రవారం ఒడిశాలో తీరాన్ని దాటిన ‘ఫొని’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ కారణంగా ఒడిశాలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 11 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. అటు పశ్చిమ బెంగాల్ లో కూడా ‘ఫొని’ తుఫాన్ ప్రభావం వల్ల రవాణా వ్యవస్థ స్థంబించగా.. తీవ్ర నష్టం వాటిల్లింది.