నేడు గోవా సర్కార్‌కు “బల పరీక్ష”
పనాజీ : గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ఇవాళ బలపరీక్ష ఎదుర్కోబోతున్నారు. గోవాలో అధికార బీజేపీ.. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణంతో శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రమోద్ సావంత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత సుదిన్ ధవలికర్‌లను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఒకవేళ బల నిరూపణలో […]

పనాజీ : గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ఇవాళ బలపరీక్ష ఎదుర్కోబోతున్నారు. గోవాలో అధికార బీజేపీ.. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణంతో శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రమోద్ సావంత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత సుదిన్ ధవలికర్‌లను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఒకవేళ బల నిరూపణలో ఆయన నెగ్గితే.. గోవాలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. లేదంటే కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశాలున్నాయి.
ప్రస్తుత లెక్కల ప్రకారం.. బీజేపీకి సొంతంగా మెజార్టీ లేకపోయినా… మిత్ర పక్షాల మద్దతుతో… అధికారాన్ని కొనసాగించేందుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గోవా అసెంబ్లీలో సీట్ల సంఖ్య 40. మనోహర్ పారికర్ మరణానికి ముందు… 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మనోహర్ మరణంతో ఖాళీ స్థానాల సంఖ్య 4కు చేరింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా గత నెల్లో చనిపోయారు. అంతకుముందు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అంటే ప్రస్తుతం గోవా అసెంబ్లీలో స్థానాల సంఖ్య 36. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ… కనీసం 19 స్థానాల్లో మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది.