లిక్కర్ షాపుల ముందు అమ్మాయిల క్యూ..!

లిక్కర్ షాపుల ముందు అమ్మాయిల క్యూ..!

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి.. దీంతో.. పెద్ద సంఖ్యలో మందుబాబులు తరలిరావడంతో.. ఎక్కడ చూసినా భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.. కొన్ని షాపుల దగ్గర భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూలో కూల్‌గా వెళ్లి మందు కొంటుంటే.. మరికొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో గుమ్మికూడడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. మందుబాబులే కాదు.. మందుమహిళలు కూడా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 04, 2020 | 4:38 PM

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి.. దీంతో.. పెద్ద సంఖ్యలో మందుబాబులు తరలిరావడంతో.. ఎక్కడ చూసినా భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.. కొన్ని షాపుల దగ్గర భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూలో కూల్‌గా వెళ్లి మందు కొంటుంటే.. మరికొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో గుమ్మికూడడం ఆందోళన కలిగిస్తోంది.

కాగా.. మందుబాబులే కాదు.. మందుమహిళలు కూడా రోడ్డెక్కారు.. తమకేం తక్కువ.. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నాం.. ఈ ఒక్క విషయంలో వెనుకబాటు ఎందుకు అనుకున్నారేమో.. ఏకంగా లిక్కర్ షాపుల దగ్గరకే వచ్చేశారు. రెగ్యులర్‌గా అమ్మకాలు జరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా.. కాస్త రష్ తక్కువగా ఉన్న సమయంలో తీసుకెళ్లిపోవడం సులువే.. కానీ, ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉండడంతో వాళ్లు కూడా వైన్స్‌ షాపుల ముందు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.

వివరాల్లోకెళితే.. బెంగళూరులో ఓ మద్యం దుకాణం ఎదుట.. మహిళలు క్యూలో నిలిచినున్న ఫొటో ఒక్కటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే, మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్‌ ఏర్పాటు చేసి.. కాస్త వాళ్లకు ఇబ్బంది లేకుండా లైన్‌ క్లియర్ చేశారు నిర్వాహకులు. అయితే, మహిళలు తాగడం మామూలు విషయమే.. బెంగళూరు లాంటి నగరాల్లో అది మరీ ఎక్కువ.. పబ్స్‌కు వెళ్లి మద్యం కిక్కులో డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu