ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తాడ్వాయి సమీపంలోని163 వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన..

లాక్‌డౌన్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అనుకుంటే మళ్లీ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తాడ్వాయి సమీపంలోని163 వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన..
Follow us

|

Updated on: Dec 28, 2020 | 10:35 AM

లాక్‌డౌన్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అనుకుంటే మళ్లీ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మబ్బులు కమ్మి ముందున్న వాహనాలు కనపడక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.

ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలోని 163 వ జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. మృతుడిని మంగపేట మండలం పోతునూరి శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ కుమారుడు, కుమార్తె గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ముందున్న వాహనం కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.