ghmc elections: ఆడిక్‌మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్-బీజేపీ నేతల ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతం జరగుతున్నాయి. అయితే కొన్నిచోట్ల టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి

ghmc elections: ఆడిక్‌మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్-బీజేపీ నేతల ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 01, 2020 | 3:21 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతం జరగుతున్నాయి. అయితే కొన్నిచోట్ల టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముషీరాబాద్ నియజకవర్గంలోని ఆడిక్‌మెట్ డివిజన్ పరిధిలోని రామ్‌నగర్ ఈసేవ వద్ద ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్ నాయకుడు సుధాకర్ గుప్త బీజేపీ నేత ప్రకాష్ గౌడ్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రకాష్ గౌడ్ ఆరోపించాడు. అయితే, ఇతర డివిజన్లకు చెందిన వ్యక్తులకు పోలింగ్ కేంద్రాలకు రావడంపట్ల సుధాకర్ గుప్త అభ్యంతరం చెప్పారు. దీంతో సుధాకర్ గుప్తపై చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసులు.. రెండు పార్టీ కార్యకర్తలను చెదరగొట్టడంతో గొడవ సర్ధుమణిగింది.