బేబి బంప్ తో శీర్షాసనం.. నా ప్రియమైన భర్త కోహ్లీ సాయంతో చేశానంటూ చెప్పుకొచ్చిన అనుష్క

మోస్ట్ లవ్లీ కపుల్ లో విరాట్ అనుష్క జంట ఒకరు. ఈ జంట త్వరలో తల్లిదండ్రలు కాబోతున్నారు. అనుష్క శర్మ ఇటీవలే తన గర్భానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు.

  • Rajeev Rayala
  • Publish Date - 3:09 pm, Tue, 1 December 20
బేబి బంప్ తో శీర్షాసనం.. నా ప్రియమైన భర్త కోహ్లీ సాయంతో చేశానంటూ చెప్పుకొచ్చిన అనుష్క

మోస్ట్ లవ్లీ కపుల్  విరాట్ అనుష్క త్వరలో తల్లిదండ్రలు కాబోతున్నారు. అనుష్క శర్మ ఇటీవలే తన గర్భానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. గర్భవతిగా ఉన్నప్పటికీ అనుష్క జిమ్ యోగా వంటివి ఆపలేదు.తాజాగా భర్త విరాట్ కోహ్లీతో కలిసి యోగా చేస్తున్నప్పటి త్రోబాక్ ఫోటోను అనుష్క శర్మ సోషల్ మీడియాలో విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘నా జీవితంలో యోగాకు చాలా ప్రాధాన్యం ఉంది. కాబట్టి గర్భంతో ఉన్నప్పటికీ యోగా చేసుకోవచ్చిన వైద్యులు సూచించారు. దాంతో ఇంతకుముందులాగానే అన్ని ఆసనాలూ వేస్తున్నాను. నా ప్రియమైన భర్త కోహ్లీ సాయంతో శీర్షాసనం కూడా వేశాను`అని అనుష్క తెలిపింది. ”గర్భం తో ఇలా అభ్యాసాన్ని కొనసాగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది” అని అనుష్క వెల్లడించింది. ప్రస్తుతం అనుష్క ఇంట్లో సమయం గడుపుతుండగా విరాట్ ఆస్ట్రేలియాలో ఇండియా తరఫున ఆడుతున్నాడు.