ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం… తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం… జాలర్లకు ప్రమాద హెచ్చరికలు జారీ…

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని తెలిపారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం... తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం... జాలర్లకు ప్రమాద హెచ్చరికలు జారీ...
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 01, 2020 | 2:36 PM

Depression over Bay of Bengal ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న అల్పపీడన ద్రోణి డిసెంబర్‌ రెండో తేదీ సాయంత్రం శ్రీలంక మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత తన దిశను మార్చుకుని పశ్చిమాన ఉన్న కోమారిన్ ప్రాంతంలోకి డిసెంబర్‌ మూడు ప్రవేశిస్తుందని తెలుస్తోంది.

జాలర్లకు హెచ్చరికలు…

గడిచిన 3 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ట్రింకోమలై(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 710 కిలోమీటర్లు, కన్యాకుమారి (ఇండియా)కి ఆగ్నేయ దిశగా సుమారు 1,120 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. జాలర్లు డిసెంబర్ 1 నుంచి 4 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలోని బే ఆఫ్ బెంగాల్లో, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దక్షిణ తమిళనాడు, కేరళ, లక్ష్యదీప్, మాల్దీవ్ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

భారీ వర్షాలు పడే అవకాశం…

అల్పపీడన ద్రోణి తుపాన్ గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో డిసెంబర్ 1 నుంచి 4 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. దక్షిణ కేరళ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు డిసెంబర్ 2 నుంచి 4 మధ్య వర్షాలు పడనున్నాయి. రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు.