GHMC Elections: ఫోటో మార్ఫింగ్‌‌తో ఓటేసేందుకు యత్నం.. పట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

ఉప్పల్‌లో దొంగ ఓట్లు కలకలం సృష్టించింది. ఉప్పల్ 10 వ డివిజన్ 33 బూత్ లో దొంగ ఓటు వేస్తున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పట్టుకున్నారు.

GHMC Elections: ఫోటో మార్ఫింగ్‌‌తో ఓటేసేందుకు యత్నం.. పట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
Follow us

|

Updated on: Dec 01, 2020 | 1:43 PM

ఉప్పల్‌లో దొంగ ఓట్లు కలకలం సృష్టించింది. ఉప్పల్ 10 వ డివిజన్ 33 బూత్ లో దొంగ ఓటు వేస్తున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పట్టుకున్నారు. ఆధార్‌ కార్డులోని ఫోటోలను మార్ఫింగ్‌ చేసి యువకులు ఓటు వేసినట్లు కార్యకర్తలు గుర్తించారు. అసలు యువకుడు ఓటు వేసేందుకు రావడంతో అసలు వ్యవహారం బయటపడింది. వీరిని కాంగ్రెస్‌ నాయకులు సూర్యాపేట నుంచి తీసుకొచ్చినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలక్షణ్ అధికారులు విచారణ చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి మందమల. రజిత రెడ్డి… సూర్యాపేట కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొచ్చి… ఈ సెంటర్ లో దొంగ ఓట్లు వేస్తున్నారు అంటూ టీఆర్ఎస్ అభ్యర్థి అరటికాయల.షాలిని ఆరోపించారు.