రోహిత్ 70 శాతం మాత్రమే… ఫిట్‌నెస్ పరంగా ఇంకా వెనుకబడే ఉన్నాడన్న గంగూలీ
రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించారు. రోహిత్ ఫిట్‌నెస్ పరంగా ఇంకా వెనుకబడే ఉన్నాడని గంగూలీ ప్రకటించారు. ఓ ఆంగ్ల మేగజైన్‌కు గంగూలి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ ‘రోహిత్ ఇంకా...

రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించారు. రోహిత్ ఫిట్‌నెస్ పరంగా ఇంకా వెనుకబడే ఉన్నాడని గంగూలీ ప్రకటించారు. ఓ ఆంగ్ల మేగజైన్‌కు గంగూలి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ ‘రోహిత్ ఇంకా 70 శాతమే ఫిట్‌గా ఉన్నాడు. అందుకనే ఈ స్టార్ ఓపెనర్‌ని వన్డే, టి20 జట్లకు ఎంపిక చేయలేదని స్పష్టం చేశారు.
టెస్టు సిరీస్‌కు ఇంకా సమయం ఉండటంతో ఆలోపు పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకుంటాడనే సంప్రదాయ ఫార్మాట్‌కు ఎంపిక చేశామని అన్నారు. అయినా ఫిట్‌నెస్ గురించి రోహిత్‌ను ఎందుకు అడగరు అంటూ దాదా ప్రశ్నించారు.
ఐపీఎల్ మధ్యలోనే ‘హిట్‌మ్యాన్’ గాయపడ్డాడు. గత నెల 18న పంజాబ్‌తో జరిగిన పోరులో రోహిత్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అతను తర్వాతి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తర్వాత కీలకమైన ప్లే ఆఫ్ దశకు ముందు మ్యాచ్ నుంచే జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించి జట్టును ఐదోసారి గెలిపించాడు. అయితే ఈ సమయంలోనే గంగూలీ అతన్ని జాగ్రత్త పడమన్నాడు. ఈ ఐపీఎలే తన కెరీర్‌కు ఆఖరు కాదని, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించాడు. రోహిత్‌లాంటి స్టార్ బ్యాట్స్‌మన్‌ను తొలగించలేదని, వైస్ కెప్టెన్‌కు విశ్రాంతి ఇచ్చామని అప్పట్లో దాదా చెప్పాడు. బోర్డు చీఫ్ సూచనల్ని ఏమా త్రం లెక్కచేయని రోహిత్ ఫైనల్ సహా వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడాడు.