AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌ృష్ణాలో..మంత్రి పదవికి తీవ్ర పోటీ..జగన్ చూపు ఎవరివైపో

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఈ నెల 8న  మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో ఎంతమందికి చోటు దక్కుతుంది ? ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది ? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రికార్డు స్థాయిలో 151 మంది ఎమ్మెల్యేలు గెలవడం..ఎన్నికలకు ముందు కొంతమందికి సీట్ల సర్ధుబాట్లలో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు హామి ఇవ్వడం. వీరితో పాటు ఉమ్మారెడ్డి వంటి సీనియర్ నేతలు […]

క‌ృష్ణాలో..మంత్రి పదవికి తీవ్ర పోటీ..జగన్ చూపు ఎవరివైపో
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2019 | 2:31 PM

Share

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఈ నెల 8న  మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో ఎంతమందికి చోటు దక్కుతుంది ? ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది ? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రికార్డు స్థాయిలో 151 మంది ఎమ్మెల్యేలు గెలవడం..ఎన్నికలకు ముందు కొంతమందికి సీట్ల సర్ధుబాట్లలో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు హామి ఇవ్వడం. వీరితో పాటు ఉమ్మారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా కేబినెట్ స్థానం కల్పించాలని జగన్ భావించడంతో…ఇప్పుడు మంత్రివర్గ ఏర్పాటు ఏపీ సీఎం జగన్‌కు కత్తిమీద సాములా మారింది. అయితే అన్ని జిల్లాలలో ఉన్న క్యాలుక్లేఫషన్స్ ఒక లెక్క..రాజకీయాలకు ఆయువు పట్టుగా భావించే క‌ృష్ణా జిల్లాలో మరో లెక్క.

ఇక్కడి నుంచి మంత్రి పదవిని ఆశించే వారి జాబితా చాలా పెద్దదిగానే ఉంది. టీడీపీకి అత్యంత పట్టున్న ఈ జిల్లాలో ఈ సారి వైసీపీ పాగా వేసింది. మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో 14 సీట్లను దక్కించుకుని విజయకేతనం ఎగరవేసింది.

కృష్ణా జిల్లాలో మంత్రి పదవిని ఆశించేవారిలిస్ట్‌:వారి బలాబలాలు

1. కొడాలి నాని(గుడివాడ)

కష్టనష్టాల్లో జగన్‌కి తోడుగా ఉండటం కృష్ణా జిల్లాలో బలంగా ఉండే కమ్మ సామాజికవర్గాన్ని చెందిన నేత కావడం టీడీపీ అధినేత చంద్రబాబుపై బెరుకు లేకుండా విమర్శలు చేయడం వరసగా నాల్గవసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం క్యాడర్‌లో బలమైన పట్టు

2.సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట)

క‌ృష్ణా జిల్లా నుంచి వైసీపీలో చేరిన మొదటి నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాపు సామాజికవర్గకోటా వైఎస్‌ఆర్ హయాంలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అనుభవం చెక్కుచెదరని సొంత క్యాడర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించడం నిత్యం జనంలో ఉండటం

3.కొలుసు పార్థసారథి(పెనమలూరు)

గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం పలు శాఖలపై సమర్థవంతమైన పట్టు యాదవ సామాజికవర్గకోటా సీనియర్ నేతగా గుర్తింపు టీవీ కార్యక్రమాల్లో పార్టీ వాయిస్ వినిపించడం

4.పేర్ని నాని(మచిలీపట్నం)

జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు సీనియర్ ఎమ్మెల్యే అవ్వడం పార్టీ కోసం లాయల్‌గా పనిచెయ్యడం కాపు సామాజికవర్గకోటా ఎప్పుడూ ప్రజల్లో ఉండటం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవడం

5.మల్లాది విష్ణు(విజయవాడ సెంట్రల్)

వైఎస్సార్‌కి సన్నిహితుడిగా గుర్తింపు బ్రహ్మణ సామాజికవర్గ కోటా టీవీ కార్యక్రమాల్లో పార్టీ వాయిస్‌ని వినిపించడం గతంలో ఉడా ఛైైర్మన్‌గా చేసిన అనుభవం

వీరితో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సామాజికవర్గ కోటాల్లో మంత్రి పదవలు ఆశిస్తున్నారు

ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!