కలకాలం నిలిచేది స్నేహమొక్కటే.. ఇవాళే ” ఫ్రెండ్‌షిప్ డే”

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడొక సినీ కవి.  మానవ సంబంధాల్లో స్నేహానికున్న విలువ అలాంటిది.   బంగారం కరిగిపోవచ్చు..డబ్బు తరిగిపోవచ్చు..పువ్వు వాడిపోవచ్చు.. గుండె ఆగిపోవచ్చు.. కానీ స్నేహం మాత్రం నిలిచే ఉంటుంది. ఒక బంధం కలకలం పదిలంగా నిలవాలంటే వారి మధ్య ఉండాల్సింది స్నేహమే. నీ కోసం నేనున్నానంటూ తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం. స్నేహం నిత్యనూతనం, నిత్య పరిమళం. ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషాన్నయినా, విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే. శత్రువు ఒక్కడైనా ఎక్కువే… స్నేహితులు […]

కలకాలం నిలిచేది స్నేహమొక్కటే.. ఇవాళే  ఫ్రెండ్‌షిప్ డే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 04, 2019 | 9:49 AM

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడొక సినీ కవి.  మానవ సంబంధాల్లో స్నేహానికున్న విలువ అలాంటిది.   బంగారం కరిగిపోవచ్చు..డబ్బు తరిగిపోవచ్చు..పువ్వు వాడిపోవచ్చు.. గుండె ఆగిపోవచ్చు.. కానీ స్నేహం మాత్రం నిలిచే ఉంటుంది. ఒక బంధం కలకలం పదిలంగా నిలవాలంటే వారి మధ్య ఉండాల్సింది స్నేహమే.

నీ కోసం నేనున్నానంటూ తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం. స్నేహం నిత్యనూతనం, నిత్య పరిమళం. ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషాన్నయినా, విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే. శత్రువు ఒక్కడైనా ఎక్కువే… స్నేహితులు వందమంది అయినా తక్కువే అన్నారు స్వామి వివేకానంద. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయిన ఆధునిక కాలంలో..నిజమైన మనిషి మాయమైపోతున్నాడు. ఈ సమయంలోనే ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతూనే వున్నాయి. స్నేహమంటే తన మిత్రుడి విజయానికి బలాన్నిచ్చే శక్తి. ఎప్పుడో చిన్నప్పుడు…బుడి బుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే…పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరి కొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ కాలేజీలోనో, లైబ్రరీలోనో, కలిసి నడిచే కారిడార్‌లోనో మొలకెత్తేది స్నేహం. పాఠశాల తరగతి గదిలోని ఒకే బెంచిపై, మాస్టారు బోధించే పాఠాల్లో నుంచి వచ్చే సందేహాల్లో ఊపిరి పోసుకొనేదే స్నేహం. మనతో బాటే ఎదిగి జీవితంతో మమేకమై ఒక విడదీయరాని అనుబంధమైపోతుంది.

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్‌షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇదొక సాంప్రదాయంగా వస్తోంది.

అమెరికా ప్రభుత్వం 1935 ఆగస్టు మొదటి శనివారం ఓ వ్యక్తిని చంపింది. అతని మరణవార్త విని ఆ మరుసటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వము వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది. క్రమేణా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2011లో ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఇంగ్లిష్‌ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన విన్నీ ది పూహ్‌ కార్టూన్‌ క్యారెక్టర్‌ టెడ్డీబేర్‌ను ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ భార్య నానె అన్నన్‌ 1998లో ప్రకటించారు.భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్‌ దేశాల్లో ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్స్‌ను ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్తాన్‌లో మాత్రం జూలై 30న చేసుకుంటారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20న నిర్వహిస్తారు.

స్నేహంలోని గొప్పదనం ఎన్నిరకాలుగా వర్ణించినా తక్కువే అని అంటారు. ఈభావాన్ని స్వయంగా అనుభవిస్తే తప్ప అందులోని మాధుర్యం అర్థంకాదు. అంతటి ఉన్నతమైన స్నేహం కోసం కేటాయించుకున్నదే స్నేహితుల రోజు. బంధాలు ఏర్పడడానికి కారణమౌతోంది. కానీ ప్రస్తుతం మారిపోయిన పరిస్థుతులలో ఇద్దరి వ్యక్తుల మధ్య అవసరాలు, అట్రాక్షన్ వల్లనే స్నేహం పుడుతోందని మనస్తత్వ శాస్త్రవేత్తలు విశ్లేషణలు చేస్తున్నారు. ఫ్రెండ్ లేనివాడు ఒక అనాథ అంటూ ప్రెంచ్ భాషలో సామెత కూడ ఉంది. ఎలాంటి అరమరికలు లేని స్నేహానికి పునాదులు వేస్తూ .. స్నేహంలో తప్పొఒప్పులను సరిచేసుకుంటూ మంచి మిత్రులుగా సాగిపోయే స్నేహితులందరికి ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు.

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు