కోస్తాకు భారీ వర్ష సూచన!
కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు.. మిగతా కోస్తా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటికే కోస్తా జిల్లాల్లోని పోర్టులకు మూడో నెంబర్ […]
కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు.. మిగతా కోస్తా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటికే కోస్తా జిల్లాల్లోని పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది.