Free WiFi: 5600 స్టేషన్లలో ఉచిత వైఫై అందించనున్న రైల్‌టెల్!

Free WiFi: ప్రభుత్వరంగ సంస్థ రైల్‌టెల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5600 స్టేషన్లలో ఉచిత వైఫైని అందిస్తోంది. దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో అధిక వేగంతో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించే ‘స్టేషన్‌’ కార్యక్రమానికి … గూగుల్ సాంకేతిక సహకారంతో భారతీయ రైల్వే 2015లో శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఒప్పందం 2020లో ముగియనుంది. దీంతో ఈ పథకాన్ని ఉపసంహరించుకోనున్నామని గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైల్‌టెల్‌ స్పందించింది. గూగుల్ నుండి సాంకేతిక సహకారంతో ఆరంభించిన 415 స్టేషన్లతో […]

Free WiFi: 5600 స్టేషన్లలో ఉచిత వైఫై అందించనున్న రైల్‌టెల్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 18, 2020 | 5:55 PM

Free WiFi: ప్రభుత్వరంగ సంస్థ రైల్‌టెల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5600 స్టేషన్లలో ఉచిత వైఫైని అందిస్తోంది. దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో అధిక వేగంతో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించే ‘స్టేషన్‌’ కార్యక్రమానికి … గూగుల్ సాంకేతిక సహకారంతో భారతీయ రైల్వే 2015లో శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఒప్పందం 2020లో ముగియనుంది. దీంతో ఈ పథకాన్ని ఉపసంహరించుకోనున్నామని గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైల్‌టెల్‌ స్పందించింది.

గూగుల్ నుండి సాంకేతిక సహకారంతో ఆరంభించిన 415 స్టేషన్లతో సహా దేశవ్యాప్తంగా 5,600 కి పైగా రైల్వే స్టేషన్లలో రైల్‌టెల్ ఉచిత వైఫైని అందిస్తుంది. ఈ పథకంలో గూగుల్‌ కేవలం 415 స్టేషన్లలో మాత్రమే భాగస్వామిగా ఉంది. ఈ కార్యక్రమంలో గూగుల్ మాత్రమే కాకుండా మరిన్ని సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. కాగా గూగుల్‌ విరమణతో ఈ పథకానికి ఏ సమస్య ఎదురు కాదు. ఆయా స్టేషన్లలో నిరంతరాయంగా వైఫై సేవలు అందించేందుకు మేం ఏర్పాట్లు చేశాం’ అని రైల్‌టెల్‌ స్పష్టం చేసింది.