నిమ్స్‌లో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్.. పేషెంట్ల తరలింపు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

నిమ్స్‌లో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్.. పేషెంట్ల తరలింపు..
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 6:29 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో ఇటీవలే 30కి పైగా వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ సోకిన విషయం విదితమే. ఇప్పుడు పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా పేషెంట్ల ద్వారా వైద్య సిబ్బందికి సైతం కరోనా సోకడం భయాందోళనలు సృష్టిస్తోంది.

వివరాల్లోకెళితే.. తెలంగాణలోని కరోనా కేసుల్లో చాలావరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగంలో నలుగురు రెసిడెంట్ డాక్టర్లు, ముగ్గురు వైద్య సిబ్బందికి మంగళవారం కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బుధవారం ఆ విభాగంలోని వైద్యులు, సిబ్బంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేశారు. గురువారం కార్డియాలజీ ప్రొఫెసర్‌తో పాటు మరో నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..