మద్యం తాగి వస్తున్న వ్యక్తిపై దాడి.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు..
ఆదిలాబాద్ పట్టణంలో జల్సాలకు అలవాటు పడిన ఓ ముఠా.. ఓ బాధితున్ని నడి రోడ్డుపై చితకబాది ఉల్టా చోర్ కొత్నాల్కు మార అనే విధంగా.. బాధితుడినే దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో కూపీ లాగితే అసలు గుట్టు రట్టైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కల్పన బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట శనివారం సాయంత్రం ఓ వ్యక్తి మద్యం సేవించి బయటకు వచ్చాడు.

ఆదిలాబాద్ పట్టణంలో జల్సాలకు అలవాటు పడిన ఓ ముఠా.. ఓ బాధితున్ని నడి రోడ్డుపై చితకబాది ఉల్టా చోర్ కొత్నాల్కు మార అనే విధంగా.. బాధితుడినే దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో కూపీ లాగితే అసలు గుట్టు రట్టైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కల్పన బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట శనివారం సాయంత్రం ఓ వ్యక్తి మద్యం సేవించి బయటకు వచ్చాడు. అదే సమయంలో అక్కడే కాపు కాసిన ఓ ముగ్గురు వ్యక్తులు పక్కనే ఉన్న ఆటోలోకి ఆ వ్యక్తిని ఎక్కించే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గట్టిగా ప్రతిఘటించడంతో ఆ వ్యక్తిని పట్టుకుని చితబాదారు ఆ నలుగురు. పక్కనే ఉన్న వారు ఆ వ్యక్తిని ఎందుకు కొడ్తున్నారంటూ నిలదీయడంతో.. మా వద్ద డబ్బులు చోరీ చేసి పారిపోతున్నాడని చెప్పడంతో స్థానికులు కూడా అదే నిజమని నమ్మారు. సీన్ కట్ చేస్తే ఆ నలుగురి చేతిలో దాడికి గురైన వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం.. పోలీసులు విచారణ చేపట్టి.. సీసీ కెమెరా ఆధారంగా నిందితులను గుర్తించడం చకచకా జరిగిపోయింది. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ బాధితుడిపై దాడి చేసిన ఆ నలుగురు మాములు వ్యక్తులు కాదని.. గతంలో హత్యలకు, దొంగతనాలకు, దోపిడికి పాల్పడిన గ్యాంగ్ అని తేలింది.
వివరాల్లోకి వెళితే మీర్జా ముషరఫ్ బేగ్ (19) ముస్సు.. ఆదిలాబాద్ జిల్లాలోని వడ్డెర కాలనికి చెందిన వ్యక్తి, షేక్ బిలాల్(21), గజ్బే అక్షయ్ (25), మేస్రం దత్తు (25) కలిసి గ్యాంగ్గా ఏర్పడ్డారు. గంజాయి మత్తుకు బానిసైన ఈ ముఠా జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం హత్యలు, దోపిడీలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇళ్లలో దొంగతనాలకు తెరలేపారు. ఈనెల 25 న మద్యం సేవించి బార్ నుండి బయటకు వస్తున్న బేల మండలానికి చెందిన మెస్రం కైలాస్ అనే వ్యక్తిని టార్గెట్ చేసిన ఈ నలుగురు.. కాపుకాసి అతడిపై దాడికి దిగారు. ఆటోలోకి ఎక్కించే ప్రయత్నం చేయడంతో మేస్రం కైలాస్ గట్టిగా ప్రతిఘటించడంతో అతని వద్ద ఉన్న రూ.10 వేల నగదును లాక్కొని అక్కడి నుండి పరారయ్యారు. ఆ నలుగురి చేతిలో గాయపడ్డ బాదితుడు కైలాస్ టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. కైలాస్ నుండి వివరాలు తెలుసుకున్న పోలీసులు విచారణలో భాగంగా బార్ సీసీ టీవి పుటేజ్ ను చెక్ చేశారు. అయితే అందులో కైలాస్పై దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించిన.. అక్కడున్న వారు మాత్రం బాధితుడే దొంగ తనానికి పాల్పడ్డాడని.. అందుకే ఆ నలుగురు దాడి చేశారని తెలిపారు. దీంతో లోతుగా దర్యాప్తుచేపట్టిన పోలీసులకు అసలు విషయాలు తెలిశాయి. దాడికి పాల్పడ్డ ఆ నలుగురు బాధితులు కాదని.. పేరు మోసిన గజదొంగలను.. అమాయకులను టార్గెట్ చేసి ఏమార్చి డబ్బులు లాక్కునే బ్యాచ్ అని పోలీసులు గుర్తించారు. తమదైన స్టైల్లో విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
A4 ఆటో డ్రైవర్ మేస్రం దత్తు సహాయంతో నిందితులు A1 ముషరఫ్ బేగ్ (19) అలియాస్ ముస్సు A2 షేక్ బిలాల్(21) బాధితుడు మెస్రం కైలాస్ను నడిరోడ్డుపై చితక బాదుతూ మా డబ్బులే దొంగలించావ్ అంటూ చిత్రీకరిస్తూ A3 గజ్జె అక్షయ్ సహాయంతో బాధితున్ని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామంటూ నమ్మించి.. బాధితుడిపై దాడికి పాల్పడి పదివేల రూపాయలను బలవంతంగా లాక్కెల్లినట్టుగా పోలీసులు తేల్చారు. ఈనెల 13 న కూడా ఇదే తరహాలో రైల్వే స్టేషన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిపై కారులో వచ్చి అతనిని దాడి చేసి కిడ్నాప్ చేసినట్టుగా తేలిందని పోలీసులు తెలిపారు. 2022 లో నిందితులు A1, A2 లు తాంసి మండలం వడ్డాది ప్రాజెక్టు సమీపంలో డబ్బుల కోసం ఒక మైనర్ బాలున్ని కిడ్నాప్ చేసి.. అతని వద్ద ఉన్న బైక్ ను లాక్కోని.. బాలుని కాళ్లు చేతులు కట్టేసి ప్రాజెక్టులో పడేసి హత్యకు పాల్పడ్డారని.. ఆ కేసులో జైలుకు కూడా వెళ్లినట్టుగా పోలీసులు తెలిపారు. A1 ముషరఫ్ బేగ్ (19) అలియాస్ ముస్సు A2 షేక్ బిలాల్ (21) లపై ఇప్పటికే 20 కేసులు ఉన్నట్టుగా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. అమాయకులను టార్గెట్ చేయడం.. డబ్బులు లాక్కోవడం.. హత్యలు చేయడం ఈ గ్యాంగ్ కు కొట్టిన పిండని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక షిఫ్ట్ డిజైర్ కారు, ఒక ఆటో, ఒక సెల్ ఫోన్, 4వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. నిందితులపై ఆదిలాబాద్ టూ టౌన్ 194/2024, U/S 394,365 r/w 511 IPC 198/2024 394, 365 r/w 34 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




