AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం

విచారణ కోసం ఓ మాజీ మాజీ రౌడీషీటర్ ను పోలీస్ స్టేషన్ కు పిలవగా, అతడు అక్కడ న్యూసెన్స్ క్రికెట్ చేశాడు. అంతటితో ఆగలేదు. ఏకంగా 104 వాహనానికే నిప్పు పెట్టాడు.

విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం
Ram Naramaneni
|

Updated on: Sep 16, 2020 | 10:16 AM

Share

విచారణ కోసం ఓ మాజీ మాజీ రౌడీషీటర్ ను పోలీస్ స్టేషన్ కు పిలవగా, అతడు అక్కడ న్యూసెన్స్ క్రికెట్ చేశాడు. అంతటితో ఆగలేదు. ఏకంగా 104 వాహనానికే నిప్పు పెట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులోని కరుణ కాలనీకి చెందిన నేలటూరి సురేశ్ అనే మాజీ రౌడీ షీటర్ 108 కు పదే పదే రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ కోసం నిందితుడిని పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అతడు పీఎస్ లోని అద్దాలను ధ్వంసం చేయడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతని మెంటల్ కండీషన్ బాగాలేదని గ్రహించిన పోలీసులు… స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనాన్ని రప్పించారు.

పోలీసు స్టేషన్ కు వచ్చిన 108 వాహనంలోకి ఎక్కిన నిందితుడు తన చేతిలో ఉన్న అగ్గిపెట్టతో నిప్పు అంటించాడు. ఒక దశలో మంటలు తీవ్రంగా వ్యాప్తించినా… అతడు బయటికి వచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో తెలివిగా వ్యవహారించిన పోలీసులు అతడిని బయటికి తీసుకొచ్చి రిమ్స్ కు తరలించారు.

Follow Us