మాజీ ఎమ్మెల్సీ శారద కన్నుమూత

శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్సీ మజ్జీ శారద(58) గుండెపోటుతో మంగళవారం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. మాజీ ఐపిసిసి అధ్యక్షుడు, దివంగత మజ్జీ తులసి దాస్ పెద్ద కుమార్తె. తన తండ్రి తులసీదాస్ చనిపోయిన తరువాత 1994లో గ్రూప్ 1 ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శారద మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. ఆమె 2007లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్సీగా ఆమె నాలుగేళ్లకే పరిమితమయ్యారు. APCC ఉపాధ్యక్షురాలిగా కూడా […]

  • Publish Date - 8:07 am, Wed, 16 October 19 Edited By:
మాజీ ఎమ్మెల్సీ శారద కన్నుమూత

శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్సీ మజ్జీ శారద(58) గుండెపోటుతో మంగళవారం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. మాజీ ఐపిసిసి అధ్యక్షుడు, దివంగత మజ్జీ తులసి దాస్ పెద్ద కుమార్తె. తన తండ్రి తులసీదాస్ చనిపోయిన తరువాత 1994లో గ్రూప్ 1 ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శారద మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. ఆమె 2007లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్సీగా ఆమె నాలుగేళ్లకే పరిమితమయ్యారు. APCC ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అన్ని పార్టీల నాయకులతో ఆమెకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఏ పార్టీ నాయకులతోనూ వివాదాలు లేవు. వ్యక్తిగత విమర్శలకు కూడా ఆమె దూరంగా ఉన్నారు. శారద మరణం పై పలువురు కాంగ్రెస్ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు పలాసలో శారద అంత్యక్రియలు జరగనున్నాయి.