Chinese manja Banned: చైనా మాంజాపై అటవీ శాఖ నిషేధం.. అమ్మినా.. కొన్నా.. ఏడేళ్ల జైలు శిక్ష..!

|

Jan 12, 2021 | 6:44 AM

చైనా మాంజాను ఎవరైనా వినియోగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీశాఖ హెచ్చరించింది.

Chinese manja Banned: చైనా మాంజాపై అటవీ శాఖ నిషేధం.. అమ్మినా.. కొన్నా.. ఏడేళ్ల జైలు శిక్ష..!
Follow us on

Action against sale of Chinese manja: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి నిషేధిత చైనా మాంజాపై అటవీశాఖ అంక్షలు విధించింది. చైనా మాంజాను ఎవరైనా వినియోగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీశాఖ హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధించవొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన అటవీ శాఖ.. చైనా మాంజా అమ్మకం, కొనుగోళ్ల కట్టడిపై హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో సోమవారం అటవీ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు. తెలంగాణలో చైనా, నైలాన్‌ మాంజాపై నిషేధముందని, అమ్మినా, కొనుగోలు చేసిన చట్టప్రకారం చర్యలు తప్పవని అటవీసంరక్షణ ప్రధానాధికారి ఆర్‌.శోభ హెచ్చరించారు. చైనా మాంజా క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే అటవీశాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004255364కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Eating Apple: యాపిల్‌తో ఆ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమెరికా పరిశోధకులు..