Eating Apple: యాపిల్‌తో ఆ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమెరికా పరిశోధకులు..

Benefits With Apple: రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. యాపిల్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివని దాని అర్థం. అయితే..

Eating Apple: యాపిల్‌తో ఆ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమెరికా పరిశోధకులు..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 12:44 AM

Benefits With Apple: రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. యాపిల్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివని దాని అర్థం. అయితే కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో యాపిల్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. క్రమం తప్పకుండా యాపిల్‌ తీసుకుంటే మతిమరుపు దూరమవుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్‌కి యాపిల్‌తో చెక్‌పెట్టవచ్చని చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదపడతాయని అమెరికాలోని మసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఎలుకలపై వీరు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. యాపిల్‌లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మతిమరుపు నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్ర్తవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా యాపిల్‌ తినడం వల్ల వయసుతో చర్మంపై ఏర్పడే ముడతలు కూడా తొలిగిపోతాయని, చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి యాపిల్‌తో పాటు యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: Best Health News: చలికాలంలో ఈ పండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటా.. అవి ఎంటంటే ?