ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం: నిర్మల
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పలు కొత్త పథకాలకు బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. దేశంలోని అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని ప్రవేశపెడుతుననట్లు మంత్రి ప్రకటించారు. చైనా, అమెరికా తర్వాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నిర్మల సీతారామన్ తెలిపారు. ఫేమ్ స్కీమ్ ఫేజ్ 2 కింద ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన […]
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పలు కొత్త పథకాలకు బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. దేశంలోని అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని ప్రవేశపెడుతుననట్లు మంత్రి ప్రకటించారు. చైనా, అమెరికా తర్వాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నిర్మల సీతారామన్ తెలిపారు. ఫేమ్ స్కీమ్ ఫేజ్ 2 కింద ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
ఫేమ్ 2 స్కీమ్ 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. దీనికి సంబంధించి రానున్న మూడు సంవత్సరాలలో రూ.10,000 కేటాయింపులు ఉంటాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని..అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకమైన చార్జింగ్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాయితీలను కేవలం అడ్వాన్స్‌డ్ బ్యాటరీ అండ్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అందిస్తామని స్పష్టం చేశారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకే పెట్రోల్ ధర పెంపు లాంటి నిర్ణయాలు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. పెట్రోల్ వాడకం తగ్గితే.. దేశంలో పొల్యూషన్ తగ్గుతుందని ఆమె వివరించారు. ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు.