పెట్రోల్ బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు.. అయోమయంలో వాహనదారులు

దేశంలో పెట్రో కలవరం మొదలైంది. లీటరుకు రూపాయి పెంచుతూ ఏకంగా బడ్జెట్‌లోనే ప్రస్తావించడంపై సామన్యుడు ఆందోళనలో పడ్డాడు. కేంద్రం పెంచిన సెస్‌కు లోకల్ ట్యాక్స్ కలిపి రూ.2 దాటింది. దీంతో లీటర్ పెట్రోల్‌కు రూ.2.50 పైసలు, లీటర్ డీసెల్‌కు రూ.2.30 పైసలు ఇప్పటికే పెంచేశారు బంక్‌ల నిర్వాహకులు. బడ్జెట్‌లో పెట్రోల్ రేటు పెంచుతున్నట్టు తేలిపోవడంతో వాహనదారులు ఎక్కడికక్కడే బంకుల ముందు వాలిపోయారు. అయితే వారికి పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. బడ్జెట్‌లో వరాలకు […]

పెట్రోల్ బంక్‌ల వద్ద  నో స్టాక్ బోర్డులు.. అయోమయంలో వాహనదారులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2019 | 9:46 PM

దేశంలో పెట్రో కలవరం మొదలైంది. లీటరుకు రూపాయి పెంచుతూ ఏకంగా బడ్జెట్‌లోనే ప్రస్తావించడంపై సామన్యుడు ఆందోళనలో పడ్డాడు. కేంద్రం పెంచిన సెస్‌కు లోకల్ ట్యాక్స్ కలిపి రూ.2 దాటింది. దీంతో లీటర్ పెట్రోల్‌కు రూ.2.50 పైసలు, లీటర్ డీసెల్‌కు రూ.2.30 పైసలు ఇప్పటికే పెంచేశారు బంక్‌ల నిర్వాహకులు.

బడ్జెట్‌లో పెట్రోల్ రేటు పెంచుతున్నట్టు తేలిపోవడంతో వాహనదారులు ఎక్కడికక్కడే బంకుల ముందు వాలిపోయారు. అయితే వారికి పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. బడ్జెట్‌లో వరాలకు బదులు బాదుడు ఎక్కవయ్యే సరికి వాహనదారుల్లో అసంతృప్తి, అసహనమే మిగిలాయి.