బడ్జెట్‌ ప్రభావంతో రూ.2.5 పెరగనున్న పెట్రోల్‌!

సామాన్యుడి బడ్జెట్ అంటూనే కేంద్రం కామెన్‌మెన్ తలపై పెద్ద గుదిబండను పెట్టింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అతి త్వరలో పెరగనున్నాయి. తాజా బడ్జెట్‌లో సుంకాల పెంపు నేపథ్యంలో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.2.3 మేర పెరగనుంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను రూ.1తో పాటు, రోడ్డు, ఇన్‌ఫ్రాస్ట్రచ్చర్ సెస్‌ కింద మరో రూ.1 చొప్పున విధిస్తున్నట్లు బడ్జెట ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఈ పన్నుల వల్ల రూ.28వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. […]

బడ్జెట్‌ ప్రభావంతో రూ.2.5 పెరగనున్న పెట్రోల్‌!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 05, 2019 | 9:42 PM

సామాన్యుడి బడ్జెట్ అంటూనే కేంద్రం కామెన్‌మెన్ తలపై పెద్ద గుదిబండను పెట్టింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అతి త్వరలో పెరగనున్నాయి. తాజా బడ్జెట్‌లో సుంకాల పెంపు నేపథ్యంలో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.2.3 మేర పెరగనుంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను రూ.1తో పాటు, రోడ్డు, ఇన్‌ఫ్రాస్ట్రచ్చర్ సెస్‌ కింద మరో రూ.1 చొప్పున విధిస్తున్నట్లు బడ్జెట ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఈ పన్నుల వల్ల రూ.28వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. తాజా టాక్స్‌లకు వ్యాట్‌ను అదనంగా జోడించినప్పుడు పెట్రోల్‌ రూ.2.5, డీజిల్‌ రూ.2.3 మేర పెరిగే అవకాశం ఉంది.