FlipKart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది… ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.. వేటిపై ఎంత డిస్కౌంట్..
FlipKart Big Saving Days: ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' వచ్చేస్తోంది. వినియోగదారులకు డిస్కౌంట్ ధరలో వస్తువులను అందించేందుకు ఈ సేల్‌ను తీసుకువస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది...
FlipKart Big Saving Days: ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ వచ్చేస్తోంది. వినియోగదారులకు డిస్కౌంట్ ధరలో వస్తువులను అందించేందుకు ఈ సేల్‌ను తీసుకువస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ నెల 20న మొదలుకానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ నాలుగు రోజుల పాటు కొనసాగి జనవరి 24న ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనున్నట్లు తెలిపింది. సామ్‌సంగ్, ఐఫోన్, మోటరోలాతో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొంది. ఇక ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, హెడ్‌ఫోన్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల మీద 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ బిగ్ సేవింగ్ డేస్‌లో స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. ఇక ఫ్యాషన్ యాక్సెసరీలపై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఈఎంఐ ద్వారా వస్తువులు కొనుగోలు చేసే యూజర్లకు 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: State Bank Of India: ఎస్బీఐలో సూపర్ అవకాశం.. నెలకు కేవలం రూ.500 నుంచి కట్టొచ్చు..