తృణమూల్‌ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాలం కలిసిరావడం లేదు.. చాపకిందనీరులా నెమ్మదిగా చొచ్చుకుని వస్తున్న భారతీయ జనతాపార్టీని ఎలా నిలువరించాలో అర్థంకాక సతమతమవుతోన్న అపర కాళికకు సొంత పార్టీ నుంచే నిరసన సెగలు తగులుతున్నాయి.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు.. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశానికి అయిదుగురు మంత్రులు డుమ్మా కొట్టడంతో పార్టీలో కాసింత అలజడి మొదలయ్యింది.. సమావేశానికి హాజరుకాని మంత్రులు కొందరు అనారోగ్యాన్ని […]

తృణమూల్‌ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు
Follow us
Balu

|

Updated on: Nov 12, 2020 | 4:09 PM

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాలం కలిసిరావడం లేదు.. చాపకిందనీరులా నెమ్మదిగా చొచ్చుకుని వస్తున్న భారతీయ జనతాపార్టీని ఎలా నిలువరించాలో అర్థంకాక సతమతమవుతోన్న అపర కాళికకు సొంత పార్టీ నుంచే నిరసన సెగలు తగులుతున్నాయి.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు.. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశానికి అయిదుగురు మంత్రులు డుమ్మా కొట్టడంతో పార్టీలో కాసింత అలజడి మొదలయ్యింది.. సమావేశానికి హాజరుకాని మంత్రులు కొందరు అనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారు కానీ అసలు కారణం అది కాదని తెలుస్తోంది. మంత్రిమండలి సమావేశానికి రాని వారిలో ప్రముఖులు రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి.. ఈయనైతే గత కొన్ని నెలలుగా పార్టీకి దూరంగానే ఉంటున్నారు.. అధికారిక కార్యక్రమాలలో కూడా పార్టీ బ్యానర్‌ను ఉపయోగించుకోవడం లేదు.. రేపో మాపో సువేందు పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.. ఇక రాజీవ్‌ బెనర్జీ, గౌతమ్‌ దేబ్‌, రవీంద్రనాథ్‌, పార్థా ఛటర్జీ కూడా కేబినెట్‌ సమావేశానికి హాజరుకాలేదు.. గౌతమ్‌ దేబ్‌, రవీంద్రనాథ్‌లేమో కరోనా కారణం చూపించారు.. పార్జా ఛటర్జీ ఆరోగ్యం బాగోలేదని కబురు పంపారు. రాజీవ్‌ బెనర్జీ ఎందుకు డుమ్మా కొట్టారో తెలియడం లేదు. పార్టీలో తిరుగుబాటుకు ఇది సంకేతం కాదు కదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.. అసలే బెంగాల్‌లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ ఉరకలేస్తోంది.. కార్యకర్తలు కూడా కదనోత్సాహంతో ఉన్నారు.. అధినాయకత్వం కూడా ప్రణాళికబద్ధంగా ముందుకు కదులుతోంది.. బీహార్‌ విజయం తర్వాత మోదీ చేసిన ప్రసంగంలో బెంగాల్‌నే ప్రస్తావించారు.. బెంగాల్‌లో పరిస్థితులను అర్థం చేసుకోవాలని, బీహార్‌లోలాగే అక్కడి కార్యకర్తలు కూడా ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారని మోదీ అన్నారు. దీన్ని బట్టి బెంగాల్‌ను బీజేపీ అధినాయకత్వం ఎంత సీరియస్‌గా తీసుకున్నదో అర్థమవుతుంది..