కోవిద్-19 చిత్రాన్ని బంధించిన భారతీయ శాస్త్రవేత్తలు..!
కోవిద్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్.. ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. కోవిడ్-19 వ్యాధికి

కోవిద్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్.. ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే కరోనా వైరస్‌ను ఎట్టకేలకు భారతీయ శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. వైరస్‌ను ఫొటో తీశారు. ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి పూణెలోని శాస్త్రవేత్తలు ఫొటో తీశారు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న తొలి కరోనా కేసు నమోదైంది.
కాగా.. దీనిని పూణెలోని ప్రయోగశాల నిర్ధారించింది. చైనాలోని వూహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తిరిగి భారత్ చేరుకున్నారు. వీరందరికీ కోవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఓ మహిళ గొంతును శుభ్రం చేస్తుండగా ఈ వైరస్.. ‘సార్స్-కోవ్-2’ను గుర్తించి ఫొటో తీశారు. ‘సార్స్-కోవ్-2’ వైరస్ దాదాపు ‘మెర్స్-కోవ్’ వైరస్‌ను పోలి ఉంది. ఇది 2012లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్‌కు కారణమైంది. 2002లో సార్స్-కోవ్ వైరస్ ‘సెవర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్)కు కారణమైంది.



