బిగ్ బ్రేకింగ్ : మోదీ నివాసానికి సమీపంలో అగ్ని ప్రమాదం..

ఢిల్లీ : 9 లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్‌కేఎమ్ కాంప్లెక్స్‌కు దగ్గర్లోని ఎస్పీజీ రిసెప్షన్ ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి 9 ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన నేపథ్యంలో ప్రధాని నివాసానికి వెళ్లే రోడ్లన్నీ క్లోజ్ చేశారు. ప్రధాని నివాసానికి సమీపంలో ఇటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు మోదీ భద్రతపై ఆందోళన […]

బిగ్ బ్రేకింగ్ : మోదీ నివాసానికి సమీపంలో అగ్ని ప్రమాదం..
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2019 | 8:34 PM

ఢిల్లీ : 9 లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్‌కేఎమ్ కాంప్లెక్స్‌కు దగ్గర్లోని ఎస్పీజీ రిసెప్షన్ ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి 9 ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన నేపథ్యంలో ప్రధాని నివాసానికి వెళ్లే రోడ్లన్నీ క్లోజ్ చేశారు. ప్రధాని నివాసానికి సమీపంలో ఇటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు మోదీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా అగ్ని ప్రమాదంపై ప్రధాని కార్యాలయం స్పందించింది.  షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని, ఇప్పుడు మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టు ట్వీట్ చేసింది.