స్టూడెంట్‌ను కొట్టి.. కేసులో బుక్కయిన టీచర్, ప్రిన్సిపాల్
స్టూడెంట్స్‌ను ఎడాపెడా బాదడానికి ఇది పాత తరం కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ విసృతంగా వ్యాప్తి చెందింది. చట్టాలలో కూడా చాలా మార్పులు వచ్చాయి. విద్యార్థులకు సన్మార్గంలో చదువు, క్రమశిక్షణ నేర్పాలి గానీ, దండిస్తే మారతారనుకోవడం అపోహే. అయితే కుషాయిగూడలో రెచ్చిపోయిన ఓ టీచర్ స్టూడెంట్‌ను ఇష్టమొచ్చినట్టు కొట్టి ఇప్పుడు చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళ్తే..హెచ్‌బీ కాలనీకి చెందిన నిఖిల్ సాయి(13) ఈసీఐఎల్‌లో ఎస్‌ఆర్ డీజీ పాఠశాలలో సెవెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ సోమవారం రోజున ఫిజిక్స్ టీచర్ […]
స్టూడెంట్స్‌ను ఎడాపెడా బాదడానికి ఇది పాత తరం కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ విసృతంగా వ్యాప్తి చెందింది. చట్టాలలో కూడా చాలా మార్పులు వచ్చాయి. విద్యార్థులకు సన్మార్గంలో చదువు, క్రమశిక్షణ నేర్పాలి గానీ, దండిస్తే మారతారనుకోవడం అపోహే. అయితే కుషాయిగూడలో రెచ్చిపోయిన ఓ టీచర్ స్టూడెంట్‌ను ఇష్టమొచ్చినట్టు కొట్టి ఇప్పుడు చిక్కుల్లో పడింది.
వివరాల్లోకి వెళ్తే..హెచ్‌బీ కాలనీకి చెందిన నిఖిల్ సాయి(13) ఈసీఐఎల్‌లో ఎస్‌ఆర్ డీజీ పాఠశాలలో సెవెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ సోమవారం రోజున ఫిజిక్స్ టీచర్ స్కూల్‌కి రాకపోవడంతో మరో టీచర్ క్లాస్ తీసుకుంది. ఈ క్రమంలో అల్లరి చేస్తున్నారని పిల్లలపై ఆమె విరుచుకుపడింది. నిఖిల్ సాయి తలపై ఐరన్ స్కేల్‌తో బాదడంతో తీవ్ర రక్తస్తావమైంది. విషయం పేరెంట్స్ దృష్టికి వెళ్లడంతో..వారు స్కూల్ వచ్చి ఆరా తీయగా…మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. దీంతో వెంటనే కుమారుడికి ట్రీట్మెంట్ చేయించి, పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు తల్లిదండ్రులు. దీంతో టీచర్ శశికళతో పాటు ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఇక్కడ కూడా చిన్న ట్విస్ట్ ఉంది. మాములుగా ఫిర్యాదు చేయడానికి వెళ్తే..పోలీసులు సరిగ్గా స్పందించలేదు. బాలుడి తాత రిటైర్ట్ పోలీస్ ఉద్యోగి అయిన దయానంద్ ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన స్పందించి..కేసు నమోదు చేశారు.