బీచ్‌లో నగ్నంగా పరుగెత్తిన నటుడు, కేసు నమోదు
బీచ్‌లో నగ్నంగా పరుగెత్తి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలీవుడ్ మోడల్, యాక్టర్ మిలింద్ సోమన్‌పై కేసు నమోదైంది.

బీచ్‌లో నగ్నంగా పరుగెత్తి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలీవుడ్ మోడల్, యాక్టర్ మిలింద్ సోమన్‌పై కేసు నమోదైంది. అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలతో గోవా పోలీసులు కేసు ఫైల్ చేశారు. బుధవారం నాడు ఆయన 55వ బర్త్ డే సందర్భంగా తన ఫిట్‌నెస్‌ను ప్రపంచానికి చూపించడం కోసం బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా మిలింద్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలో మిలింద్ ఫిట్‌నెస్‌ను చూసి మంది ప్రశంసించచారు. అయితే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ మిలింద్ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని గోవా సురక్షా మంచ్ ఆయన మీద కంప్లైంట్ చేసింది. దీంతో గోవా పోలీస్ స్టేషన్‌లో ఆయన మీద సెక్షన్ 294( పబ్లిక్ ప్లేస్‌లో అశ్లీలంగా ప్రవర్తించడం), ఐటీ యాక్ట్ 67 కింద ఆయన మీద కేసు నమోదయ్యింది. ( భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు )
అంతకు ముందు బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై కూడా ఇదే తరహాలో కేసు నమోదైంది. బహిరంగ ప్రదేశంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకుగానూ ఈమెపై ఫిర్యాదు చేశారు. అనంతరం బెయిల్పై పూనమ్ బయటకొచ్చినట్లు తెలుస్తోంది.
Also Read :
Flash : అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్
ఈ నెలాఖరులో యాసంగి ‘రైతుబంధు’ !




